టఫ్ ఫైట్ కి తెర లేపుతూ విజయ్ “బీస్ట్” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

టఫ్ ఫైట్ కి తెర లేపుతూ విజయ్ “బీస్ట్” కి రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Mar 22, 2022 11:54 AM IST

కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ “బీస్ట్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో సినిమా నుంచి వచ్చిన పాటలు కూడా అదిరే రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి.

మరి ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి రిలీజ్ డేట్ పట్ల ఉన్న రూమర్స్ ని నిజం చేస్తుం ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకొంది. ఇది వరకే ఏప్రిల్ 14న భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” తో ఈ చిత్రం రిలీజ్ కూడా రిలీజ్ అవుతుందని గాసిప్స్ వచ్చాయి. మరి ఇప్పుడు దానిని నిజం చేస్తూ తమిళ నాట ముఖ్యంగా భారీ ఫైట్ కి తెర లేపారు.

ఈ సినిమాని ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. అయితే ఇది కోలీవుడ్ లో మాత్రం చాలా టఫ్ గా ఉంటుందని చెప్పాలి. మరి చూడాలి ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే విజయ్ సరసన నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు