దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ చెంతకు “బీస్ట్” స్ట్రీమింగ్ రైట్స్?

Published on Aug 14, 2021 3:00 pm IST

ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ రీసెంట్ గా మాస్టర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “బీస్ట్”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాలను నెలకొల్పుకుంది. మరి ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి బయటకి వచ్చింది.

మరి ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :