ఓటీటీ : ఈ 3 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ ల “మేరీ క్రిస్మస్”

ఓటీటీ : ఈ 3 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ ల “మేరీ క్రిస్మస్”

Published on Mar 8, 2024 9:00 AM IST

Merry Christmas

తమిళ నాట టాలెంటెడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా బాలీవుడ్ స్టార్ నటి కత్రినాకైఫ్ హీరోయిన్ గా అందధూన్ ఫేమ్ దర్శకుడు శ్రీరాం రాఘవన్ తెరలెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే హిందిలో మంచి వసూళ్ళని ఈ చిత్రం అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈరోజు నుంచి వారు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేశారు.

అయితే మొదటగా ఈ చిత్రం కేవలం హిందీ, తమిళ్ లోనే స్ట్రీమింగ్ కి వస్తుంది అని కంఫర్మ్ కాగా ఇప్పుడు మరో భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్ రావడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పుడు ఈ సినిమా మన తెలుగు భాషలో కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూద్దాం అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా టిప్స్ నిర్మాణ సంస్థ అలాగే మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు