బాలయ్య మూవీ ఆఫర్‌ను తిరస్కరించిన విలక్షణ నటుడు?

Published on Aug 19, 2021 10:59 pm IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. #NBK107 టైటిల్‌తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసినప్పటి నుంచి బాలయ్య సరసన నటించే హీరోయిన్, విలన్ ఎవరన్న చర్చ గట్టిగా నడుస్తుంది. అయితే దర్శకుడు గోపిచంద్ ముందుగా శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించగా ఆ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట. దర్శకుడు సెంటిమెంట్‌ను కాద‌న‌లేక ఏదైనా గెస్ట్ రోల్ అయితే చేస్తాన‌ని శృతిహాస‌న్ చెప్పిన‌ట్టు టాక్ నడుస్తుంది.

అయితే ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టేందుకు తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని గోపిచంద్ సంప్రదించారని ఇటీవల వార్తలు వినిపించాయి. తాజా బజ్ ప్రకారం విజ‌య్ సేతుప‌తి కూడా శృతిహాస‌న్ లాగే గోపీచంద్ మ‌లినేని ఆఫ‌ర్‌కు నో చెప్పాడ‌ని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు గోపిచంద్ మలినేని ఇతర నటులను సంప్రదించే పనిలొ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టును పెద్ద స్టార్లతో చేయాలని ప్రయత్నిస్తున్న దర్శకుడు గోపిచంద్‌కు ఇలా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :