“కసడ తబర” టీజర్ ను విడుదల చేసిన విజయ్ సేతుపతి!

Published on Aug 16, 2021 7:00 pm IST

తమిళ నాట మరొక అంథాలజీ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. కసడ తబర తమిళ చిత్రం ప్రేక్షకులని అలరించేందుకు సిద్దం అవుతోంది. బ్లాక్ టికెట్ కంపనీ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకాల పై వెంకట్ ప్రభు, ఆర్ రవీంద్రను లు నిర్మాతలు గా వ్యవహరిస్తూ, చింబు దేవెన్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

హరీష్ కళ్యాణ్, సందీప్ కిషన్, శాంతాను, వెంకట్ ప్రభు, ప్రేమ్ జీ, రెజీనా కాసాండ్రా, ప్రియ భవాని శంకర్, విజయ లక్ష్మి, అరవింద్ ఆకాష్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కసడ తబర టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ ఆరు కథలకు యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, జిబ్రాన్, ప్రేమ్ జీ, సామ్ సి.ఎస్, సేన్ రోల్డాన్ లు సంగీతం అందిస్తున్నారు. వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు e చిత్రం ను తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :