మరోసారి గాయకుడి అవతారం ఎత్తిన విజయ్

మరోసారి గాయకుడి అవతారం ఎత్తిన విజయ్

Published on Jul 9, 2019 1:29 AM IST

చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని తపనపడే స్టార్ హీరో విజయ్ ఆ కొత్తదనం కోసం తన వంతు సహకారాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం చేస్తున్న ‘బిగిల్’ సినిమా కోసం గాయకుడిగా మారారాయన. గతంలో కూడా ‘మెర్సల్, సర్కార్’ సినిమాలకు పాటలు పాడిన విజయ్ దర్శకుడు అట్లీ సలహా మేరకు ఈ చిత్రానికి కూడా పాట పాడటానికి సిద్దమయ్యారు.

సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సమక్షంలో పాటను కూడా పాడారాయన. ఇలా విజయ్ సినిమాలో పాట పాడటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో అట్లీ కుమార్, విజయ్ కాంబినేషన్లో ‘మెర్సల్, తేరీ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి ఉండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు