స్టార్ హీరో సినిమాపై వస్తున్నవన్నీ రూమర్లేనట !

ఇటీవలే ‘మెర్సల్’ చిత్రంతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన తమిళ స్టార్ హీరో విజయ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి విధితమే. అయితే తమిళ సినీ వర్గాల్లో గత కొన్నిరోజులుగా ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని, అందులో ఒక పాత్ర దివ్యాంగుడి పాత్రని వార్తలొచ్చాయి.

వీటిపై వెంటనే స్పందించిన చిత్ర టీమ్ అవన్నీ ఒట్టి రూమర్లేనని తేల్చేసింది. అయితే విజయ్ ద్విపాత్రాభినయం చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే అవకాశాలున్నాయి. 2018 జనవరి 20న మొదలుకానున్న ఈ సినిమా అదే ఏడాది దసరాకు రిలీజ్ కానుంది.