‘రాహు’ విజయవంతం కావాలి – విజయశాంతి

Published on Feb 26, 2020 9:08 pm IST

సుబ్బు వేదుల దర్శకత్వంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలుగా రాబోతున్న సినిమా ‘రాహు’. కాగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 28న సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా కాన్సెప్ట్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా వైవిధ్యంగా ఉంటాయట. అందుకే సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాకి తమ సపోర్ట్ ను అందిస్తున్నారు.

లేడి అమితాబ్ విజయశాంతి ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ‘హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతను ఇస్తూ, కొత్త తరహా కథా వస్తువుతో చేసిన ఈ సినిమా ‘రాహు’ విజయవంతం కావాలని, మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. అని విజయశాంతి పోస్ట్ చేశారు. ఇక రాహు శాటిలైట్, డిజిటిల్ హాక్కులు జి తెలుగు సొంతం చేసుకుంది. మొత్తానికి ఈ సినిమా పై బాగానే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత సమాచారం :