ఇంట్రెస్టింగ్ గా విక్రమ్ “మహాన్” టీజర్.!

Published on Jan 31, 2022 1:00 pm IST


కోలీవుడ్ స్టార్ అండ్ విలక్షణ నటుల్లో స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ కూడా ఒకరు. మరి విక్రమ్ ఇప్పుడు పలు ఆసక్తికర సినిమాలనే చేస్తుండగా ఆ మధ్య ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ అయ్యిన చిత్రమే “మహాన్”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విక్రమ్ మరియు తన కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిపి ఒక క్రేజీ మల్టీ స్టారర్ ని చేస్తున్నాడని వచ్చిన వార్తలు మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

మరి ఇప్పుడు ఈ సినిమా తాలూకా టీజర్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు. ఇది మాత్రం గతంలో కార్తీక్ సుబ్బరాజ్ చూపించిన రెగ్యులర్ టెంప్లెట్ కి భిన్నంగా అనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథలా ఇది కనిపిస్తుంది. ఇక అలాగే విక్రమ్ పెర్ఫామెన్స్ కూడా ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత కాస్త డిఫరెంట్ యాటిట్యూడ్ లో కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఎఫెక్టివ్ గా అనిపించడమే కాకుండా లాస్ట్ లో ధృవ్ పై షాట్ కూడా మంచి అంచనాలు సెట్ చేస్తుంది. ఓవరాల్ గా అయితే కార్తీక్ సుబ్బరాజ్ నుంచి ఈ టీజర్ బాగానే అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే. ఆ రోజు నుంచి ఈ చిత్రం నేరుగా ఓటిటి యాప్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :