మహేష్ బాబుతో సినిమా ఎందుకు ఆగిపోతోందో చెప్పిన వినాయక్ !

స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని చాలా కాలం క్రితమే వార్తలొచ్చాయి. అప్పట్లో కొన్ని చర్చలు కూడా నడిచాయని అన్నారు. కానీ ప్రాజెక్ట్ అయితే వర్కవుట్ కాలేదు. దానికి గల కారణాలు కూడా బయటకురాలేదు. కానీ ఇప్పటికీ మహేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచన తనలో ఉందని వినాయక్ అంటున్నారు.

తాజగా జరిగిన ‘ఇంటిలిజెంట్’ ప్రెస్ మీట్లో మహేష్ బాబుతో సినిమా ప్రస్తావన రాగానే వినాయక్ చేయాలనుకున్న మాట వాస్తవమే. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ సరైన కథ కుదరకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. కథ కుదిరితే తప్పకుండా చేస్తాను అన్నారు. మరి వీరిద్దరి క్రేజీ కాంబోకి మంచి కథ కుదురి సినిమా మొదలవ్వాలని ఆశిద్దాం. ఇకపోతే వినాయక్ డైరెక్ట్ చేసిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న రిలీజ్ కానుండగా మహేష్ ‘భరత్ అనే నేను’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.