థరమ్ తేజ్ లో చిరంజీవిగారి లక్షణాలన్నీ ఉన్నాయి – వినాయక్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా నిన్న చిత్ర యూనిట్ రాజమండ్రిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సందర్బంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ తేజ్ కు మంచి ఫ్యూచర్ ఉంది. కష్టపడే తత్త్వం ఉంది అన్నారు.

అలాగే దర్శకులను ప్రేమించే గుణం ఉంది. ఇవన్నీ అన్నయ్య చిరంజీవిగారిలో ఉండే లక్షణాలే. మెగాస్టార్, పవర్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో తేజ్ చేస్తే అలానే ఉంటుంది అన్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. 2014 లో కూకట్ పల్లి ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.