షూటింగ్ స్టార్ట్ చేయనున్న వినాయక్

షూటింగ్ స్టార్ట్ చేయనున్న వినాయక్

Published on Jan 21, 2020 9:00 PM IST

డైరెక్టర్ వి.వి.వినాయక్ నటుడిగా కొత్త టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన చేస్తున్న మొదటి ‘సీనయ్య’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో ఈ సినిమా లాంఛ్ అయింది. ఇన్నిరోజులు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదికి వెళ్లనుంది.

జనవరి 27 నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలుకానుంది. ఇందులో వినాయక్ మెకానిక్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎన్.నరసింహ డైరెక్ట్ చేయనుండగా మణిశర్మ సంగీతం అందివ్వనున్నారు. ఇందులో కథానాయికగా శ్రియను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు నిర్మాతలు. ఇకపోతే ఈ చిత్రం పూర్తిస్థాయి ఎమోషనల్ ఎంటెర్టైనర్ గా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు