ఆ హీరోతో సినిమా చేయడంలేదన్న వినాయక్ !
Published on Mar 21, 2017 11:40 am IST


‘ఖైదీ నెం 150’ తో భారీ విజయాన్నందుకుని మరోసారి టాప్ దర్శకుల లీగ్ లో చోటు సంపాదించుకున్న దర్శకుడు వినాయక్ తన తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇంతలోపే ఆయన మంచు మనోజ్ హీరోగా ఒక చిత్రం ప్లాన్ చేశారని, ప్రస్తుతం వాటి పనులే జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా అనౌన్స్ అవుతుందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన వినాయక్ ఈ వార్తల్లో ఏ ఏమాత్రం నిజం లేదని, అన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. మొన్న తిరుపతిలో జరిగిన మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన మనోజ్ తో పాటే ఉండటంతో వాళ్ళిద్దారూ కలిసి సినిమా చేస్తున్నారనే రూమర్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే మనోజ్ కూడా తన తర్వాతి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ పనుల్లో బిజీగా ఉన్నారు.

 
Like us on Facebook