వైరల్ : ఢిల్లీలో “అవెంజర్స్” హీరో..ఇక్కడెందుకు కనిపించాడంటే.!

Published on May 21, 2022 2:00 pm IST


ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానులకి “అవెంజర్స్” పేరుని గాని ఆ సినిమాల మార్వెల్ కామిక్స్ కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ అవెంజర్స్ సిరీస్ అయితే ముగిసిపోయింది కానీ ఆ సినిమాలను గాని ఆ సినిమాల్లో కనిపించే ఏ ఒక్క సూపర్ హీరోని కూడా ఆడియెన్స్ అయితే మర్చిపోలేరు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సూపర్ హీరో అయినటువంటి “హాక్ ఐ” పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం ఈ నటుడు మన బాలీవుడ్ సీనియర్ నటుడు అయినటువంటి అనీల్ కపూర్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారికి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు ఇక్కడికి వచ్చాడట. ఈ షూటింగ్ రాజస్థాన్ లో జరగనుండగా తాను ఇండియా లో ల్యాండ్ అయ్యాక ఢిల్లీలో కనిపించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తన నుంచి రీసెంట్ గా హాట్ స్టార్ లోనే హాక్ ఐ సిరీస్ వచ్చి మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :