వైరల్ పిక్ : బీస్ట్ మోడ్ లో హీరో సూర్య

Published on May 11, 2023 11:55 pm IST


కోలీవుడ్ స్టార్ యాక్టర్ హీరో సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో తన కెరీర్ 42 సినిమా చేస్తున్నారనేది తెలిసిందే. ఈ సినిమాకి కంగువ టైటిల్‌ను ఇటీవల ఫిక్స్‌ చేశారు. ఇటీవలే లాంఛ్ చేసిన కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం కొన్నాళ్ల క్రితం ప్రారంభం అయిన కంగువ కొత్త షెడ్యూల్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా 10 భాషల్లో విడుదల కానుంది. అలానే అటు ౩డీ ఫార్మాట్‌లో సందడి చేయబోతుంది కంగువ. ఈ సినిమాకి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా దీనిని 2024 ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ కోసం ఫుల్ గా బాడీ పెంచుతోన్న సూర్య తాజగా జిమ్ లో వర్కౌట్ చేస్తోన్న పిక్ ఒకటి ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో బీస్ట్ మోడీ లో సూర్య ని చూడవచ్చు. ఇక కంగువ మూవీ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ఇందులో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :