షూటింగ్‌ పూర్తి చేసుకున్న విశాల్-ఆర్యల ‘ఎనిమీ’.!

Published on Jul 14, 2021 3:01 am IST


విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘ఎనిమీ’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత విశాల్, ఆర్య క‌లిసి నటిస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.

మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మమతా మోహన్‌ దాస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోశిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :