కరోనా పై త్వరలో రానున్న ‘విశ్వక్’ !

Published on Mar 31, 2020 6:59 pm IST

కరోనా వైరస్ మొత్తం ప్రపంఛాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఇప్పటికే చాల మంది పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇంకా లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా దేశాలలో చిక్కుకున్న చాలా మంది భారతీయులు అకస్మాత్తుగా మన దేశానికి తిరిగి వచ్చారు. అయితే దీనిని కీలక ఆలోచనగా తీసుకొని ‘విశ్వక్’ పేరుతో తెలుగు చిత్రం తీశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ఏప్రిల్ 3న విడుదల కానుంది.

కాగా ఎన్ఆర్ఐలు ఇప్పుడు భారతదేశానికి తిరిగి రావడానికి ఎందుకు ఎంచుకున్నారు ? కానీ కరోనా ముందువరకూ వారు ఎందుకు మన దేశానికి ఎందుకు రాలేదు ? ఏమైనా మన దేశం నుండి వెళ్ళిపొయిన వాళ్ళు కూడా ఇప్పుడు భారతదేశాన్ని సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపింది చిత్రబృందం. ఇక ఈ చిత్రానికి వేణు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా కరోనా వాస్తవాలను ఎలా ప్రదర్శిస్తోందో అనే ఆసక్తి నెటిజన్లో నెలకొంది.

సంబంధిత సమాచారం :

X
More