లెగసీ అనౌన్స్‌మెంట్ టీజర్.. మరో బోల్డ్ అటెంప్ట్‌తో వస్తున్న విశ్వక్ సేన్

లెగసీ అనౌన్స్‌మెంట్ టీజర్.. మరో బోల్డ్ అటెంప్ట్‌తో వస్తున్న విశ్వక్ సేన్

Published on Jan 1, 2026 7:04 PM IST

legacy te

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం అనుదీప్ కెవి డైరెక్షన్‌లో ‘ఫంకీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఓ పవర్‌ఫుల్ వీడియో టీజర్‌తో అనౌన్స్ చేశాడు. గతంలో ‘పిండం’ వంటి హారర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాయి కిరణ్ దైడ డైరెక్షన్‌లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు.

ఈ సినిమాకు ‘లెగసీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఈ అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే రివీల్ చేశారు మేకర్స్. రాజకీయ వారసత్వం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను మేకర్స్ రూపొందించనున్నారు. విశ్వక్ చాలా సటిల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని కంటెంట్ చాలా బోల్డ్‌గా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

రాజకీయ వారసత్వాన్ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ఏక్తా రాథోడ్, రావు రమేష్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కె కె మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ దైడ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు