‘పొన్నియన్ సెల్వన్ 2’ పై విజనరీ డైరెక్టర్ ప్రసంశలు

Published on May 6, 2023 12:36 am IST

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిషా, శోభితా ధూళిపాళ్ల వంటి నటులు కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ పీరియాడికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2. గత ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన పొన్నియన్ సెల్వన్ 1కి సీక్వెల్ గా రూపొందిన పార్ట్ 2 ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.

మద్రాస్ టాకీస్ వారితో కలిసి లైకా ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ పై పలువురు ప్రేక్షకాభిమానులు పాజిటివ్ గా స్పందిస్తుండగా కోలీవుడ్ విజనరీ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ పై కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా ప్రసంశలు కురిపించారు. పొన్నియన్ సెల్వన్ 2 ని మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, విక్రమ్ ఇద్దరూ కూడా అద్భుతంగా పలు సీన్స్ లో అదరగొట్టారని అన్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం తో పాటు ఇతర పాత్రధారులు, టెక్నీషియన్స్ అందరూ కూడా అదరగొట్టారని అన్నారు. మొత్తంగా పొన్నియన్ సెల్వన్ 2 పై శంకర్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :