తెలుగులో భారీ స్థాయిలో విడుదలవుతున్నతమిళ సినిమా !

Published on Feb 26, 2019 8:31 am IST

తల అజిత్ నటించిన విశ్వాసం ఇటీవల కోలీవుడ్ లో విడుదలై సుమారు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు తోపాటు కన్నడ లో కూడా విడుదలవుతుంది.

ఇక తెలుగులో ఈ చిత్రం మార్చి 1 న 400 పైగా స్క్రీన్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం తెలుగులో పెద్ద సినిమాల రిలీజ్ లేనందున ఈ చిత్రానికి ఈ స్థాయిలో థియేటర్లు లభించాయి. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం హావ కొనసాగిస్తుందో చూడాలి. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రను పోషించారు. శివ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :