విడుదలకు సన్నద్ధం అవుతున్న స్టార్ హీరో సినిమా !

Published on Feb 21, 2019 1:00 am IST

శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టి అజిత్ కెరీర్ లోనే సూపర్ హిట్ ఫిల్మ్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెలుగులో కూడా రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మార్చి 1వ తేదీన ‘విశ్వాసం’ తెలుగులో విడుదల అవనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించింది.

కాగా ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిచాడు. మరి తమిళంలో లాగే ‘విశ్వాసం’ తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :