నితిన్ సినిమాపై డైరెక్టర్ సాలిడ్ ప్రామిస్.!

Published on May 12, 2023 7:55 am IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తన రేంజ్ కం బ్యాక్ మళ్ళీ అందుకోవాలని అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఇదే సమయంలో దర్శకుడు వెంకీ కుడుముల తో చేసిన “భీష్మ” చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ కం బ్యాక్ గా నిలిచింది. అయితే హీరోయిన్ రష్మికా మళ్ళీ నితిన్ ఇదే దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండో సినిమా అనౌన్స్ చేయడంతో దానిపై క్రేజీ హైప్ సెట్ అయ్యింది.

అయితే దీనిపై మాత్రం లేటెస్ట్ గా వెంకీ, నితిన్ ఫ్యాన్స్ కి మరోసారి సాలిడ్ ప్రామిస్ అందించాడు. డెఫినెట్ గా ఈ సినిమా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఈ మెసేజ్ సేవ్ చేసి పెట్టుకోండి అంటూ బలంగా చెప్తున్నాడు. దీని బట్టి ఈ చిత్రంతో కూడా వారు మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే రేంజ్ నమ్మకంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :