సంక్రాంతికే చిరు సినిమా వచ్చేస్తుందన్న వినాయక్!

chiru-150

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజును పురస్కరిచుకొని గత నెల్లో విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఇప్పటికే సగ భాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని టీమ్ ఎప్పుడో ప్రకటించగా, తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు వీవీ వినాయక్ మరోసారి స్పష్టం చేశారు.

రాజమండ్రిలోని విద్యా గణపతి ఆలయాన్ని సందర్శించిన వినాయక్, ఆ తర్వాత అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి 150వ సినిమా తాము అనుకున్నట్లుగానే చాలా బాగా వస్తుందని, సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదలవుతుందని తెలిపారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.