ఆ యంగ్ హీరోతో వినాయక్.. నిజమేనా ?

ఆ యంగ్ హీరోతో వినాయక్.. నిజమేనా ?

Published on Jun 1, 2025 11:13 AM IST

vv vinayak

యంగ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌, వివి వినాయక్ తో సినిమా చేయబోతున్నట్లు కొత్త గాసిప్ వినిపిస్తోంది. వివి వినాయక్ ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాలో హీరో పాత్ర సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, ఈ క్రమంలోనే వినాయక్, సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ను అప్రోచ్ అయ్యారని, మొత్తానికి తన సినిమాలో సిద్ధును హీరోగా తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. దర్శకుడిగా వినాయక్ కు భారీ ఇమేజ్ ఉన్నా.. ఆయన గతంలో ఎవర్ గ్రీన్ సినిమాలు చేసినా.. గత కొంతకాలంగా వినాయక్ కి సరైన హిట్ లేదు.

పైగా ఆయన సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ క్రమంలో వి.వి. వినాయక్, రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ కూడా వినిపించాయి. అంతకుముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. మళ్లీ ఇప్పుడు సిద్ధూకి వినాయక్ ఓ కథ చెప్పాడని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పడితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజా వార్తలు