‘ఎఫ్2’, ‘వివిఆర్’, ‘ఎన్టీఆర్’ల కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 18, 2019 10:45 am IST

మొత్తానికి ఈ సంవత్సరం సంక్రాతి పండుగ చూస్తుండగానే గడిచిపోయింది. మరి సంక్రాంతికి పోటీగా వచ్చిన “వినయ విధేయ రామ”, “ఎఫ్2”, “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాల కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ‘ఎఫ్2’, ‘వినయ విధేయ రామ’ ముందు వరుసలో నిలవగా.. ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం మిగిలిన రెండు చిత్రాలు కంటే కలెక్షన్స్ ను రాబట్టడంలో వెనుక బడింది.

కాగా కృష్ణా జిల్లా విషయానికొస్తే, గురువారం నాడు ఎన్టీఆర్ కథానాయకుడు రూ. 3,23,937/- లక్షల షేర్ ని రాబట్టాడు. దీంతో మొత్తం 9 రోజులకు గానూ 1,32,90,982/- కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక ‘వినయ విధేయ రామ’ విషయానికొస్తే కృష్ణా జిల్లాలో గురువారం 20,08,309/- లక్షల షేర్ ని వసూలు చేసింది. దీంతో మొత్తం 7 రోజులకు గానూ కృష్ణా జిల్లాలో 3,45,51,323/- కోట్ల షేర్ ను వసూలు చేసింది.

అలాగే ఎఫ్2 గురువారం నాడు 49,51,808/- లక్షల షేర్ వసూలు చేయగా, ఆరు రోజులకు గానూ కృష్ణా జిల్లాలో 2,79,67,496/- కోట్లు షేర్ వసూలు చేసింది.

సంబంధిత సమాచారం :

X
More