మాస్ బీట్ తో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టీ’ సాంగ్

మాస్ బీట్ తో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య ‘బాస్ పార్టీ’ సాంగ్

Published on Nov 23, 2022 4:11 PM IST

మెగాస్టార్ చిరంజీవి తాజా మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా వాల్తేరు వీరయ్య పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుకోగా నేడు కొద్దిసేపటి క్రితం మూవీ నుండి బాస్ పార్టీ పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

నాకాష్ అజిజ్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, హరి ప్రియా సూపర్ గా పాడిన ఈ సాంగ్ కి లిరిక్స్ ని కూడా దేవిశ్రీ అందించడం విశేషం. మంచి మాస్ బీట్ తో మాస్ పార్టీ స్టైల్ లో సాగిన ఈ సాంగ్ ఇన్స్టంట్ గా యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ లిరికల్ సాంగ్ లో మెగాస్టార్ తో పాటు ఊర్వశి రౌటేలా కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసారు. మొత్తంగా ఈ బాస్ పార్టీ సాంగ్ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి జోష్ ని నింపింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్ రేపు థియటర్స్ లో మరింతగా అదిరిపోనుందని తెలుస్తోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు