యూఎస్ లో కొనసాగుతున్న “వాల్తేరు వీరయ్య” హవా.!

యూఎస్ లో కొనసాగుతున్న “వాల్తేరు వీరయ్య” హవా.!

Published on Jan 26, 2023 11:09 AM IST

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. మరి మాస్ మహారాజ రవితేజ అలాగే క్యాథరిన్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. మరి మెగాస్టార్ నుంచి మళ్ళీ తన స్టామినాకి తగ్గ సిసలైన భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం యూఎస్ లో కూడా అదిరే లెవెల్ వసూళ్లు కూడా రాబడుతుంది.

మరి ఎప్పుడో 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రం లేటెస్ట్ గా 2.3 మిలియన్ వ్యూస్ ని అయితే ఈ చిత్రం అందుకున్నట్టుగా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వారు అనౌన్స్ చేశారు. అలాగే ఈ చిత్రం అక్కడ 2.5 మిలియన్ మార్క్ ని కూడా దాటొచ్చని ట్రేడ్ అంచనా. ఇక ఈ సాలిడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు