డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “వాల్తేరు వీరయ్య”

Published on Jan 13, 2023 10:02 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈరోజు థియేటర్లలో విడుదల అయ్యింది. మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యాక్షన్ ఫ్లిక్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ థెరిస్సా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :