“వాల్తేరు వీరయ్య” ఇంటర్వెల్.. రియల్ సీన్ షేర్ చేసిన చిరు.!

Published on Feb 8, 2023 4:00 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుల్లో మెగాస్టార్ చిరంజీవిని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసి భారీ వసూళ్లు అందించిన దర్శకుడు కొల్లి బాబీ కూడా ఒకరు. ఇక బాబీ సినిమాలు అయితే పలు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తన సినిమాల ఇంటర్వెల్ బ్లాక్ లకి మాత్రం సెపరేట్ క్రేజ్ ఉంది. మాస్ మహారాజ పవర్ కానీ పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ గాని ఎన్టీఆర్ జై లవ కుశ లో గాని బాబీ ఇంటర్వెల్ బ్లాక్ లు అలా పూనకాలు తెప్పించే లెవెల్లో ఉంటాయి.

ఇక ఇదే విధంగా వాల్తేరు వీరయ్య లో కూడా చిరు పై క్రియేట్ చేసిన ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఓ రేంజ్ లో హైలైట్ కాగా దీనిలో ఏనుగు పై సీక్వెన్స్ ఉంటుంది. మరి ఈ సీన్ ని రియల్ లైఫ్ లో జరిగిన వీడియో క్లిప్ ని మెగాస్టార్ షేర్ చేయడం వైరల్ గా మారింది. ఇందులో కూడా వాల్తేరు వీరయ్య లో లానే ఓ ఏనుగు రోడ్ మీద కారు ఇంజిన్ మీదకి ఎక్కు తుక్కు చేసింది. దీనితో వాల్తేరు వీరయ్య రీల్ సీన్ ని బయట జరిగిన రియల్ సీన్ తో కలిపి చిరు పోస్ట్ చేశారు. దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :