300 కోట్లకు చేరువలో సూపర్ హీరోస్

Published on Oct 20, 2019 12:03 am IST

బాలీవుడ్ లో ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్స్ నమోదయ్యాయి. కబీర్ సింగ్ వసూళ్ల సునామి ముగిసిన రెండు నెలల్లోనే వార్ చిత్రం మూవీ వసూళ్ల వరద మొదలైంది. ఇప్పటికే కబీర్ సింగ్ వసూళ్లను కూడా దాటేసిన వార్ 2019 హైయెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది. ఒక్క హిందీలో ఈ చిత్రం ఇప్పటివరకు 278కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. విడుదలై రెండు వారాలవుతున్నా, వార్ నిన్న శుక్రవారం కూడా 2.80కోట్లు వసూళ్లు సాధించడం విశేషం. ఇక తెలుగు మరియు తమిళ భాషల వసూళ్లతో కలిపి మొత్తంగా 291కోట్ల వసూళ్లకు చేరింది.

వచ్చే వారం దీపావళి కావడంతో వార్ మూవీ కచ్చితంగా 300కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు గురు శిష్యులుగా చేసిన ఈ మూవీలో వారి మధ్య వచ్చే సన్నివేశాలు పోరాట సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వాణి కపూర్ హీరోయిన్ గా చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More