త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా ?

Published on Sep 20, 2020 1:58 am IST


ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎన్నారైగా కనిపించబోతున్నాడని.. పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందని.. సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తారక్ రోల్ నిజంగానే ఎన్నారై రోల్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఫిల్మ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More