మరి పవన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఏమవుతుందో.?

Published on Apr 25, 2021 10:29 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా కాలం తర్వాత పవన్ నుంచి సినిమాగానే కాకుండా చాలా కాలం తర్వాత పవన్ ఓ సినిమాకు హిట్ టాక్ కూడా తెచ్చుకున్న సినిమా ఇది. దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని అద్భుతమైన మార్పులు చేర్పులు చేసి బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా మన దగ్గర బాగానే ఆడేసినా ఓవర్సీస్ ఆడియెన్స్ ను ఆకట్టుకోడంలో మాత్రం విఫలం అయ్యింది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ సాలిడ్ గా వచ్చినా తర్వాత రిపీటెడ్ ఆడియెన్స్ ను రాబట్టడంలో ఖచ్చితంగా విఫలం అయ్యింది ఈ సినిమా. మరి దీనికి ప్రధాన కారణం ఇది ఒక రీమేక్ అనే వినిపిస్తుంది.

ఇది వరకే దీని ఒరిజినల్ వెర్షన్ ను అక్కడ ఆడియెన్స్ కూడా చూసేసారు. అయితే ఇది అక్కడే కాకుండా మన దగ్గర కూడా ఉన్నదే. ఆల్రెడీ చూసేసిన సినిమాను మళ్ళీ ఎందుకు అన్న టాక్ పవన్ ఫ్యాన్స్ నుంచే వకీల్ సాబ్ పై వినిపించింది. అయినా అంచనాలను తప్పని ప్రూవ్ చేసి దర్శకుడు ఇక్కడ మెప్పించగలిగాడు కానీ అక్కడి ఆడియెన్స్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకొలేకపోయారు.

దీనితో ఇప్పుడు పవన్ మరో రీమేక్ సినిమాపై డౌట్స్ మొదలవుతున్నాయి. అదే అయ్యప్పణం కోషియం రీమేక్. దీనికి కూడా మూవీ లవర్స్ లో మంచి ఫాలోయింగ్ చాలా మంది కూడా చూసేసారు అందులో మన తెలుగు ఆడియెన్స్ కూడా ఉన్నారు. దీనికి ఉన్న ఇంటెన్స్ మాస్ యాంగిల్ కు సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయం కానీ దీనికి వచ్చే ఫలితం కూడా కీలకమే మరి..

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ కె చంద్ర త్రివిక్రమ్ సహాయంతో ఎలా నెట్టుకొస్తారో అన్ని వర్గాల నుంచి యూనానిమస్ బ్రేకీవెన్ ను అందుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ అలా కనుక కాకపోతే పవన్ ఈ రీమేక్స్ కు స్వస్తి చెప్పి ఆ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లా స్టార్డం కు తగ్గట్టుగా డైరెక్ట్ సాలిడ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ పోతే బెటర్.

సంబంధిత సమాచారం :