మెహర్ స్క్రిప్ట్ పై మెగాస్టార్ ఏమన్నారు.?

Published on Sep 17, 2020 9:02 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మొత్తం మూడు ప్రాజెక్టులను లైన్ లో ఉంచారు. వాటిలో మొదటిది బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన “ఆచార్య” కాగా.. మిగతా రెండు రీమేక్స్ ఉన్నాయి. అయితే వాటిలో “లూసిఫర్” చిత్రం పేరే ముందుగా వినిపించినప్పటికీ మొదటగా చిరు వేదాళం కే ప్రిపేర్ అవుతున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ మొదట సుజీత్ నుంచి వివి వినాయక్ దగ్గరకు వచ్చింది.

వినాయక్ ప్రిపేర్ చేసిన సబ్జెక్టు కు కూడా చైతు మంచి రెస్పాన్స్ ఇచ్చారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే వేదాళం రీమేక్ చేయనున్న దర్శకుడు మెహర్ రమేష్ కూడా స్క్రిప్ట్ పనులను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని కీలక మార్పులు చేర్పులు మెహర్ చెయ్యగా చిరు వాటికి ఎక్కడా వంక పెట్టకుండా సానుకూలంగానే స్పందించినట్టు టాక్. దీనితో ఆచార్య కంప్లీట్ అయ్యాక ఈ చిత్రాన్ని మొదలు పెట్టే యోచనలో చిరు ఉన్నట్టు వినికిడి.

సంబంధిత సమాచారం :

More