తెలుగులో ‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఏంటి?

తెలుగులో ‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఏంటి?

Published on Oct 9, 2026 5:02 PM IST

బాలీవుడ్ సినిమా దగ్గర సంచలనం సృష్టించిన భారీ హిట్ చిత్రం ‘హనుమాన్ అంశ్’, అక్కడ ఒక సుదీర్ఘ లాంగ్ రన్ తర్వాత ఎట్టకేలకు తెలుగులో కూడా ఇప్పుడు థియేటర్స్ లో విడుదలకి వచ్చింది. తెలుగులో గత నెల లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా వచ్చింది.

మరి హిందీలో అంత సక్సెస్ సాధించిన ఈ సినిమాకి తెలుగులో పరిస్థితి ఏంటి అనేది చూస్తే, మన దగ్గర కూడా ఈ సినిమాకి టాక్ పరంగా పాజిటివ్ వైబ్ తోనే మొదలైంది. హైదరాబాద్ లాంటి సిటీస్, ప్లెక్స్ లలో డీసెంట్ బుకింగ్స్ కూడా ఈ సినిమాకి నమోదు అవుతున్నాయి. అయితే లిమిటెడ్ ప్రమోషన్స్ కారణంగా ఇంకా ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కి మరింత రీచ్ కావాల్సి ఉంది.

టాక్ ఎలాగో పాజిటివ్ పడింది కాబట్టి అదేమైనా తెలుగులో బెటర్ రీచ్ ని తీసుకొస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా శోబిన్ సత్య బాబా నీమ్ కరోలిగా నటించగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగులో విడుదలకి తీసుకొచ్చారు.

తాజా వార్తలు