సమీక్ష: ‘గుడ్ టైం’ – పూర్తి స్థాయిలో మెప్పించని ఫన్ డ్రామా

సమీక్ష: ‘గుడ్ టైం’ – పూర్తి స్థాయిలో మెప్పించని ఫన్ డ్రామా

Published on Oct 9, 2026 2:55 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 09, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నిఖిల్ గాజుల, అన్యుక్త నల్లని, సౌందర్య లహరి, ఎం సి హరి, హృతిక్ శెట్టి, ధనరాజ్ వినీత్ తదితరులు
దర్శకత్వం : చాణక్య జిల్ల
నిర్మాత : రమేష్ జిల్ల
సంగీతం : నిర్వణ్ ఆత్రేయ
ఛాయాగ్రహణం : అన్వేష్ యాదవ్
కూర్పు : తరుణ్ రెడ్డి
సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఓ యూత్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘గుడ్ టైం’ కూడా ఒకటి. నూతన నటీనటులు, దర్శక బృందంతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

హైదరాబాద్, అల్వాల్ లో సొంతంగా క్యాబ్ డ్రైవర్ గా పని చేసే జానకి రామ్ అలియాస్ జానీ (నిఖిల్ గాజుల) ఆ క్యాబ్ డ్రైవింగ్ తో పాటుగా ఆన్లైన్ బెట్టింగులు కూడా వేస్తూ ఉంటాడు. తన తల్లి (సునీతా లక్ష్మి) ఆ ఏరియా యువ పొలిటికల్ లీడర్, రైడర్ గంగ (ఎం సి హరి) దగ్గర పని చేస్తుంది. ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా లైఫ్ లీడ్ చేసే తన లైఫ్ లోకి నిశ్చల (అన్యుక్త నల్లని) అనే ఓ కాలేజ్ అమ్మాయి వస్తుంది. అలా తన లవ్ స్టోరీ ముందు అంతా బాగానే ఉంటుంది కానీ నెమ్మదిగా జానీ కొన్ని సమస్యల ఊబిలో ఇరుక్కుపోతాడు. ఓ పక్క తన తల్లి చేసిన అప్పు, తనపై ఉన్న అప్పులు ఇంకోపక్క తన లవర్ ఇచ్చిన ట్విస్ట్ లు.. ఈ అన్నిటి నుంచి తన గుడ్ టైం కోసం జానీ ఎదురు చూస్తూ ఇంకా సమస్యలు నెత్తి మీదకి తెచ్చుకుంటాడు. మరి వీటి అన్నిటి నుంచీ జానీ బయట పడ్డాడా లేదా? అనేది ఇందులో అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో క్లుప్తంగా దర్శకుడు మూడు పాయింట్స్ చెప్పాలి అనుకున్నారు అనిపిస్తుంది. ఏ మనిషికి అయినా తమ యుక్త వయస్సు చాలా ముఖ్యం. ఆ వయసులో తాను తీసుకునే నిర్ణయాలే మిగతా జీవితం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ కోణంలో మత్తు, మగువ, జూదం ఈ మూడింటికి ఎంత దూరంగా ఉంటే లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది అనే విధంగా ఇందులో పాయింట్ కనిపిస్తుంది.

హీరో పాత్ర ఈ మూడింటి చుట్టూ తిరుగుతూ అక్కడక్కడా సాలిడ్ ఫన్ మూమెంట్స్ తో సాగుతుంది. ఇక యంగ్ హీరో నిఖిల్ తన డెబ్యూ సినిమా అయినప్పటికీ చాలా బాగా చేసాడు. తన రోల్ లో అన్నిషేడ్స్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తూ ఇంప్రెస్ చేసాడు. తనతో పాటుగా హీరోయిన్ అన్యుక్త తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

తన లుక్స్ గాని ఆమె పెర్ఫామెన్స్ లు ఇందులో బాగున్నాయి. తనపై ఓ ట్విస్ట్, డ్యూయల్ లవ్ స్టోరీ సెకండాఫ్ లో మంచి ఫన్ జెనరేట్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా రైడర్ గంగగా నటించిన ఎం సి హరి రీసెంట్ గా ‘అమీర్ లోగ్’లో మెప్పించి ఇందులో కూడా ఓ క్రేజీ రోల్ లో తాను కనిపించాడు. ఇక వీరితో పాటుగా మరో హీరోయిన్ సౌందర్య లహరి కూడా బాగా చేసింది. వీరితో పాటుగా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో హీరో యాంగిల్ వరకు కోర్ పాయింట్ బాగానే ఉంది కానీ దీనిని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకాస్త క్లారిటీగా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత బాగుండు అనిపిస్తుంది. ఒక పాయింట్ లో మెసేజ్ ఇస్తున్నారా అన్నట్టు వెళ్లే కథనం మళ్ళీ రొటీన్ గా మారి ఎటెటో వెళుతున్నట్టు అనిపిస్తుంది.

అలాగే ఫస్టాఫ్ లో కొంతమేర కథనంలో పెద్దగా కొత్తదనం ఏమి కనిపించదు. రొటీన్ ఫ్లోతో అసలు విషయంలోకి వెళ్లేందుకు కొంచెం సమయం తీసుకుంది. అయినప్పటికీ సెకండాఫ్ కథనం ఫస్టాఫ్ తో పోలిస్తే కాస్త మందగించినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ నెమ్మదిగా పికప్ అయినా ఇక్కడ మాత్రం కామెడీ డోస్ ఇక్కడ కొద్దిగా తగ్గింది.

ఇక క్లైమాక్స్ పార్ట్ కి వచ్చేసరికి కథనం దాదాపు ఊహాజనితంగానే సాగుతుంది. సెకండ్ హీరోయిన్ ప్లాట్, క్లైమాక్స్ లో పొలిటికల్ మూమెంట్స్ ఇవన్నీ రొటీన్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ లో రైడర్ గంగ, జానీ నడుమ డ్రామా ఇంకొంచెం ఇంటెన్స్ గా పెట్టాల్సింది. వారిద్దరి మధ్య ఘర్షణ ఓ రేంజ్ లో ఉంటుందేమో అనుకుంటే సింపుల్ గా వదిలేసారు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ప్యాకెడ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. యంగ్ టీం అంతా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించారు. మ్యూజిక్ ట్రెండీగా యువతని ఆకట్టుకునేలా ఉంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు చాణక్య జిల్ల విషయానికి వస్తే.. ప్రెజెంట్ జెన్ జీ ట్రెండ్ కి తగ్గ పాయింట్ ని తాను పట్టుకున్నాడు. నీట్ సెటప్, నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ లు, కొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ బాగా పండించాడు. అయితే ఈ డొసేజ్ మాత్రం ఇందులో సరిపోలేదు. సెకండాఫ్ లో ట్రాక్ తప్పాడు. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘గుడ్ టైం’ కేవలం కొన్ని ఫన్ మూమెంట్స్ వరకు మాత్రమే పర్లేదు అనిపిస్తుంది. ప్రెజెంట్ జెన్ జీ యూత్ కి తగ్గ ట్రెండీ పాయింట్ తో వచ్చినప్పటికీ చాలా వరకు సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. కానీ యువ నటీనటులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. సెకండాఫ్, క్లైమాక్స్ లను ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. వీటితో ఈ యూత్ డ్రామా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు