డైరెక్టర్ టు హీరో.. స్టార్ సీఎం కొడుకు కొత్త అవతారం..?

డైరెక్టర్ టు హీరో.. స్టార్ సీఎం కొడుకు కొత్త అవతారం..?

Published on Oct 9, 2026 4:05 PM IST

తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ త్వరలోనే హీరోగా వెండితెరపై అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ‘సిగ్మా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈ యంగ్ ట్యాలెంట్, ఇప్పుడు కెమెరా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్, ఆయనతో మళ్లీ పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు లింగుసామితో పాటు పలువురు చెప్పిన కథలను నిర్మాతలు విన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, సంజయ్ బాబాయ్ సంజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

తాజా వార్తలు