యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కలయికలో ఎప్పుడో మొదలు పెట్టిన సినిమానే ‘భారతీయుడు 2’. దీనినే నిడివి మేర రెండు భాగాలుగా చేసి ఇప్పుడు పార్ట్ 3 తీసుకొస్తున్నారు. అయితే పార్ట్ 2 భారీ ప్లాప్ అయినప్పటికీ ఏ ఫిలిం మేకర్స్ చేయని విధంగా పార్ట్ 3 ని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా అనౌన్సమెంట్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఏడాది పదో నెలలో ఉన్నాం. కానీ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తుంది. అయితే సంక్రాంతి లేదా గణతంత్ర దినోత్సవంకి సినిమా రావచ్చని టాక్.
సినిమా సబ్జెక్టుకి అయితే జనవరి 26 సమయం పర్ఫెక్ట్ కావచ్చు కానీ అది వీకెండ్ దగ్గరలో లేదు. సో ఈ అవైటెడ్ పాన్ ఇండియా హిస్టారికల్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆల్రెడీ సినిమా దాదాపు పూర్తి చేసిందే. మరికొన్ని పోర్షన్స్, సీజీ వర్క్ ఫినిష్ చేయాల్సి ఉన్నాయి. సో తక్కువ సమయమే ఉన్నా విడుదల అయితే సాధ్యమే అనుకోవచ్చు.


