మెగాస్టార్ నుంచి మళ్ళీ ఇలాంటి సీన్స్ పడేది ఎప్పుడు?

Published on Sep 20, 2020 6:26 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికీ మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే చిరు ఎలాంటి సీన్ ను అయినా సరే తనదైన నటనతో చాలా అవలీలగా చేసెయ్యగలరు. మాస్ మరియు క్లాస్ తో పాటుగా మంచి సందేశాత్మక చిత్రాలను చిరు అందించారు. అలా చిరు చేసిన ఒక పవర్ ఫుల్ మాస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమే “స్టాలిన్”.

కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నేటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఏఈ సినిమాలో ఉన్న మాస్ ఎలివేషన్ సీన్స్ అయితే ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టింగే. మాస్ ఆడియెన్స్ లో ఈ పర్టిక్యులర్ సినిమాలోని మాస్ సీన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ఈ సీన్స్ కు మాత్రమే కాకుండా మణిశర్మ టెర్రఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంటాయి.

దీనితో ఇలాంటి ఐకానిక్ సీన్స్ ముఖ్యంగా మణిశర్మ బీజీఎమ్ లో చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి మళ్ళీ అదే తరహా సినిమాలు మన టాలీవుడ్ లో కొరటాల శివ చేస్తున్నారు. మాస్ ఎలివేషన్ సీన్స్ సహా మంచి సందేశాన్ని తన చిత్రాలతో ఇస్తున్నారు. ఇపుడు లక్కీగా చిరు, మణిశర్మ కాంబోను 14 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. దీనితో మళ్ళీ అలాంటి అద్భుతమైన సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొరటాల “ఆచార్య”లో ఆశించొచ్చు.

సంబంధిత సమాచారం :

More