‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ హీరోయిన్ ఎవరో తేలనుంది !

‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ హీరోయిన్ ఎవరో తేలనుంది !

Published on Jul 2, 2018 5:29 PM IST

Varma
తెలుగులో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమానే ధృవ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల డైరెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమా యొక్క క్లైమాక్స్ పోర్షన్ చిత్రీకరణ ముగిసింది.

ప్రస్తుతం కాలేజ్ సన్నివేశాలను రూపొందింస్తున్నారు. ఈ షెడ్యూల్లో హీరోయిన్ కూడ పాల్గొంటోందని ధృవ్ విక్రమ్ తెలియజేశారు. అంతేకాదు ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే రివీల్ చేస్తామని కూడ అన్నారు. మరి ఇన్నాళ్లు రక రకాల పేర్లు వినబడగా దర్శకుడు బాల ఎవర్ని ఫైనల్ చేశారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు