ఆ ఇద్దరు బ్యూటీస్ లో బిగ్ బాస్ ఎంట్రీ ఎవరికీ?

Published on Aug 26, 2019 12:54 pm IST

అందరూ ఊహించిన విధంగానే బిగ్ బాస్ షో నుండి ఈవారం సోషల్ మీడియా సెన్సేషన్ ఆషు రెడ్డి బిగ్ బాస్ రియాలిటీ షో నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేట్ కాబడిన ఏడుగురు ఇంటి సభ్యుల నుండి ఆషురెడ్డి కి బయటకి రావడం జరిగింది. ఐతే బిగ్ బాస్ షోని మరింత రసవత్తరంగా మార్చేందుకు షో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ టాలీవుడ్ హీరోయిన్ ని పంపించాలని భావిస్తున్నారని గతకొద్ది రోజులుగా బాగా ప్రచారం జరుగుతున్న వార్త.

ఐతే ఆ హీరోయిన్స్ లో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు శ్రద్దా దాస్ కాగా, మరొకరు ఈషా రెబ్బా. వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ షోలోకి ప్రవేశించే ఆస్కారం కలదని గట్టిగా వినిపిస్తున్న మాట. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ఓ పాపులర్ మేల్ సెలెబ్రిటీ కూడా షో లోకి ప్రవేశించే అవకాశం కలదట. ఇప్పటికే ఆసక్తికరంగా సాగుతున్న షోని ఇలాంటి వార్తలు మరింత రసవత్తరంగా మార్చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :