‘కార్తికేయ 2’ కోసం 15 కోట్లు !

Published on Nov 12, 2019 8:00 pm IST

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ లో ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రూ.15 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించబడుతుందట. ముఖ్యంగా కొన్ని సీన్స్ ను విదేశాలలో చిత్రీకరించాల్సి రావడం, అలాగే సినిమాలో టాప్ – క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం కారణంగా ఈ సినిమాకి 15 కోట్లు బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. ఎలాగూ ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More