మంచి ధర పలికిన అఖిల్ ‘హలో’ చిత్ర హక్కులు!
Published on Nov 13, 2017 2:35 pm IST

అక్కినేని అఖిల్ రెండవ సినిమా ‘హలో’ ప్రస్తుతం చివరి దశల పనుల్లో ఉంది. మొదటి సినిమా పరాజయం పొందటంతో అన్ని జాగ్రత్తల్ని తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు అఖిల్. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అభిమానులు, ప్రేక్షకులు కుడా ఈ సినిమాతో అఖిల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాడని ధీమాగా ఉన్నారు.

ఈ క్రేజ్ వల్లనే ఈ సినిమా హక్కులకు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మంచి డిమాండ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క గుంటూరు జిల్లా హక్కుల్ని ఎస్వి సినిమాస్ రూ.3 కోట్ల రూపాయల్ని వెచ్చించి కొనుగోలుచేసింది. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook