పవన్ కళ్యాణ్ జిమ్ కి ఎందుకెళ్తున్నాడంటే…

పవన్ కళ్యాణ్ జిమ్ కి ఎందుకెళ్తున్నాడంటే…

Published on Sep 8, 2014 1:03 PM IST

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చక్కని ఆహార్యంతో మనకు కనిపించడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే ఆయన ఎందుకు ఇంత కష్టపడుతున్నట్లు అని ?

గబ్బర్ సింగ్ 2 సినిమాలో బీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు వుంటే తప్ప ప్రస్తుతం ఆయన చేతిలో వున్న సినిమాలకు తన ఈ ఆహార్య మార్పుకు అవసరంలేదు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం కేవలం ఫిట్ నెస్ లేవెళ్ళను కాపాడడం కోసమే పవన్ ఇంతలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది

కారణం ఏదైనా త్వరలో పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు వెండితెరపై ఫిట్ గా చూడగలరు అన్న వార్త వారికి ఆనందాన్నిస్తుంది

తాజా వార్తలు