గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna Akhanda 2) హీరోగా సంయుక్త మీనన్ అలాగే హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయలేకపోయుంది. అయినప్పటికీ అంత నెగిటివ్ లో కూడా, ఉన్నంతలో స్ట్రాంగ్ రన్ నే కొనసాగించింది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ జనవరి 9 నుంచే ఓటిటిలో ఈ సినిమా రానున్నట్టు ఖరారు చేశారు. అయితే ఈ సినిమా గత సినిమా లానే మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
గతంలో పార్ట్ 1 కి పాన్ ఇండియా ఆడియెన్స్ లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు థియేటర్స్ లో కొన్ని ఇబ్బందులు మూలాన పైగా అక్కడ ధురంధర్ ధాటితో అఖండ 2 రీచ్ అనుకున్నంత రేంజ్ లో వెళ్ళలేదు. సో ఇక అంతా ఓటిటి రిలీజ్ తర్వాత వచ్చే రీచ్ కోసమే చూస్తున్నారు. మెయిన్ గా డివోషనల్ మూమెంట్స్, యాక్షన్ లాంటి వాటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. సో అది తెలియాలి అంటే ఈ జనవరి 9 వరకు ఆగాల్సిందే.


