“ఫ్యామిలీ స్టార్” కి దిల్ రాజు సెంటిమెంట్ డేట్ వర్కౌట్ అవుతుందా

“ఫ్యామిలీ స్టార్” కి దిల్ రాజు సెంటిమెంట్ డేట్ వర్కౌట్ అవుతుందా

Published on Mar 29, 2024 8:00 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఫ్యామిలీ స్టార్”. మరి మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

అలాగే ఈ చిత్రం తనని ‘దిల్’ రాజుగా మార్చిన దిల్ చిత్రం కూడా ఫ్యామిలీ స్టార్ డేట్ లోనే వచ్చిందని గుర్తు చేయడం విశేషంగా మారింది. దీనితో తనకి యాదృచ్చికంగా వచ్చిన ఈ సెంటిమెంట్ డేట్ ప్రత్యేకంగా మారిపోయింది. మరి అప్పట్లో దిల్ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు.

ఇప్పుడు ఇదే డేట్ లోకి వస్తుండడంతో ఫ్యామిలీ స్టార్ హిస్టరీ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా రష్మికా మందన్నా ఓ క్యామియోలో నటించింది. అలాగే జగపతిబాబు, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ ఏప్రిల్ 5న ప్=తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు