తొమ్మిదేళ్ల రికార్డును “కేజీయఫ్” తిరగేస్తుందా?

తొమ్మిదేళ్ల రికార్డును “కేజీయఫ్” తిరగేస్తుందా?

Published on Jul 15, 2020 7:14 PM IST


మొత్తం మన ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మన దక్షిణాది సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. ముఖ్యంగా మన తెలుగు సినిమా అయితే రారాజుగా మారిపోయింది. అయితే మన తెలుగుతో పాటుగా తమిళ్ మరియు కన్నడ సినిమాలు కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అలా భారీ హైప్ తెచ్చుకున్న రీసెంట్ ఫ్లిక్ ఏదన్నా ఉంది అంటే అది “కేజీయఫ్ చాప్టర్ 1” అని చెప్పాలి.

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ చిత్రం ఇటీవలే తెలుగు స్మాల్ స్క్రీన్ పై మొట్ట మొదటి సారి టెలికాస్ట్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కు కూడా వీరి టీం గట్టిగానే ప్రమోట్ చేసారు. దీనితో ఈ మొదటి టెలికాస్ట్ గట్టిగానే వస్తుంది అని ఫిల్మ్ లవర్స్ అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా తొమ్మిదేళ్ల కితమే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన శంకర్ మాయాజాలం “రోబో” టీఆర్పీ ను అందుకుంటుందా లేదా అన్న అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటి వరకు మన తెలుగులో అత్యధిక టీఆర్పీ రాబట్టిన డబ్బింగ్ సినిమాలలో రజినీ మరియు శంకర్ ల నుంచి వచ్చిన ఈ భారీ రోబోటిక్ స్కై ఫై థ్రిల్లరే ఉంది.

ఈ చిత్రానికి 19.04 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీనితో ఈ మధ్య కాలంలో ఏ డబ్బింగ్ సినిమాకు రాని హైప్ తో వచ్చిన కేజీయఫ్ ఈ మాసివ్ రికార్డును బ్రేక్ చేసి ఉంటుందా లేదా అని ఫిల్మ్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయి టీఆర్పీ అందుకుందో తెలియాలి అంటే ఈ గురువారం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు