చరణ్ బర్త్ డే కు రాజమౌళి సప్రైజ్ ఇస్తాడా ?

Published on Feb 16, 2019 3:51 am IST

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ ఫై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 న ఈచిత్రం నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది. ఈ న్యూస్ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఇదిలావుంటే చరణ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :