పండుగ సీజన్ శర్వాకు మరో సారి కలిసొస్తుందా ?

Published on Dec 19, 2018 11:39 am IST

పండుగ సీజన్ యువ హీరో శర్వానంద్ కు వరంలా మారింది. ఆయన నటించిన మూడు చిత్రాలు పండుగ కు విడుదలై మంచి విజయాలను సాధించాయి. అందులో మొదటగా 2016 సంక్రాంతి కి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఈచిత్రం తరువాత 2017 సంక్రాంతి కి ‘శతమానం భవతి’ విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ అవార్డును సాధించింది. ఇక ఈ చిత్రం తరువాత అదే సంవత్సరం దసరా కు ‘మహానుభావుడు’ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇలా శర్వా కు పండుగ సీజన్ లు బాగా కలిసొచ్చాయి.

ఇక ఇప్పుడు మరో సారి ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు శర్వా. ఆయన నటించిన ‘పడి పడి లేచె మనసు’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదలకానుంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫై ఇప్పటికే మంచి అంచాలను నెలకొన్నాయి. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం కూడా హిట్ అయ్యి శర్వా పండుగ సెంటిమెంట్ ను కొనసాగిస్తాడో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :