వినాయక్ వాళ్ళిద్దరి ఫేట్ ను మారుస్తారేమో చూడాలి !

లావణ్య త్రిపాఠి.. ఒక ఏడాది ముందు వరకు టాప్ యంగ్ హీరోయిన్ల జాబితాలో ఈ పేరు ప్రముఖంగా వినబడేది. కానీ 2017 లో ఆమె చవి చూసిన పరాజయాలు రేసులో ఆమెను వెనుకబడేలా చేశాయి. గతేడాది 4 సినిమాల్లో ఆమె నటించగా వాటిలో ఒక్కటి కూడా ఆమెకు ముందుకెళ్లగల సక్సెస్ ను ఇవ్వలేకపోయింది.

వరుణ్ తేజ్ ‘మిస్టర్’ తో మొదలుపెడితే మధ్యలో శర్వానంద్ తో చేసిన ‘రాధ’, నాగ చైతన్యతో చేసిన ‘యుద్ధం శరణం’, రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ నాలుగు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటమేగాక లావణ్యకు పెద్దగా ఉపయోగపడలేదు.

దీంతో ఆమె ఆశలన్నీ రేపు రిలీజ్ కానున్న ‘ఇంటిలిజెంట్’ మీదనే ఉన్నాయి. ఇది గనుక విజయం సాధిస్తే లావణ్య కెరీర్ మరోసారి నిలదొక్కుకునే ఛాన్సుంది. అదే విధంగా ‘తిక్క, జవాన్, నక్షత్రం, విన్నర్’ వంటి వరుస ఫైల్యూర్స్ లో ఉన్న ధరమ్ తేజ్ కు కూడ ఈ చిత్ర సక్సెస్ చాలా అవసరం. మరి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వీరి కెరీర్ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.