సాలిడ్ వీడియోతో “భీమ్లా” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Aug 21, 2021 10:43 am IST

టాలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబోలో దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న సాలిడ్ రీమేక్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మాస్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై గత కొన్ని రోజులు నుంచి ఉన్న మిస్టరీకి నిర్మాత నాగవంశీ ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకొచ్చారు. మొదటగా ఈ చిత్రం రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని జనవరి 12నే వస్తున్నట్టు డేట్ ప్రకటించారు.

అలాగే పవన్ ఆన్ సెట్స్ లో ఉన్న వీడియో కూడా ఇచ్చారు. మెషిన్ గన్ పట్టుకొని షూట్ చేస్తున్న పవన్ వీడియో ఇందులో “యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదులుతాడు, యోధుడు తుపాకీ గొట్టం అంచు నుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు, నాయకుడు ఈ రెండిటిని తన భుజంపై మోసుకొని ముందుకు కదులుతాడు” అని త్రివిక్రమ్ రాసిన పవర్ ఫుల్ కోట్ తో ఈ చిత్రం నుంచి పవన్ కొంచెం బ్రేక్ తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. వీటన్నిటిని మించి ఈ చిత్రం రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు అన్న అప్డేట్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :